TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగానేకాక ప్రపంచ దేశాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు.
- Harishth Thanniru
- Published On : March 15, 2025 / 08:46 AM IST
TTD
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగానేకాక ప్రపంచ దేశాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినెలా ఆన్ లైన్ లో దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులు విడుదల చేస్తుంది. జూన్ నెల కోటాకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారికి సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డీప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. అయితే, లక్కీడీప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12గంటలలోపు నగదు చెల్లిస్తే వారికి టికెట్లు జారీ అవుతాయి.
మార్చి 21న ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను విడుదల చేస్తారు.
మార్చి 21న మధ్యాహ్నం 3గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
మార్చి 22న ఉదయం 10గంటలకు జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
మార్చి 22న ఉదయం 11గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి మే నెల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
మార్చి 22న మధ్యాహ్నం 3గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
మార్చి 24న ఉదయం 10గంటలకు జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
మార్చి 24న మధ్యాహ్నం 3గంటలకు తిరుమల, తిరుపతిలలో జూన్ నెల గదుల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
