Tirumala Tirupati Devasthanam: రేపు అంగప్రదక్షిణ, శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి భక్తుల కోసం నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదే విధంగా, డిసెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. కాగా, డిసెంబరు నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవలను ఆన్‌లైన్ లక్కీడిప్ లో అక్టోబరు 22న ఉదయం 10 గంట‌ల‌ నుండి అందుబాటులో ఉంచుతారు.

Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి భక్తుల కోసం నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదే విధంగా, డిసెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. కాగా, డిసెంబరు నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవలను ఆన్‌లైన్ లక్కీడిప్ లో అక్టోబరు 22న ఉదయం 10 గంట‌ల‌ నుండి అందుబాటులో ఉంచుతారు.

ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వివరాలు తెలిపి, భ‌క్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరింది. మరోవైపు, ఈ నెల 24వ తేదీన దీపావళి ఆస్థానం, 25వ తేదీన సూర్య గ్రహణం, అలాగే, నవంబరు 8న చంద్ర గ్రహణం కారణంగా ఆ మూడు రోజుల్లో బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..