తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. దూకుడు పెంచిన సిట్..

తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Tirupati Laddu Case

Tirupati Laddu Case: తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేస్తున్న సిట్ మరింత దూకుడు పెంచింది. టీటీడీ ఉన్నతాధికారులు, నెయ్యి సరఫరా చేసిన సంస్థలే ప్రధాన లక్ష్యంగా సిట్ తన విచారణను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చిన సిట్.. అతన్ని అదుపులోకి తీసుకొని అలిపిరిలోని సిట్ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు.

Also Read: మాజీమంత్రి బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

వైసీపీ హయాంలో ఢిల్లీలో అప్పన్న చక్రం తిప్పినట్లు.. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉందని సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అప్పన్నతో పాటు మరో ఆరుగురు టీటీడీ ఉద్యోగులను సిట్ విచారిస్తోంది. త్వరలో మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక ఛార్జ్ ను షిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో ఇప్పటికే 15మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో టీటీకి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యాజమానులు, ఉద్యోగులు ఉన్నారు.