Modified Silencers: 350 లౌడ్‌ సైలెన్సర్లను రోడ్ రోలర్లతో తొక్కించిన పోలీసులు

సైలెన్సర్లను బిగించే మెకానిక్‌ల పైన కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

loud silencer

భారీ శబ్దాలతో ఇతరులు ఇబ్బందులు పడతారన్న విషయాన్నీ పట్టించుకోండా.. భారీ శబ్దాలు చేసే బైక్ సైలెన్సర్లను బైకులకు బిగించుకున్న వారి భరతం పడుతున్నారు పోలీసులు. భారీ శబ్దాలు చేస్తూ రోడ్లపై తిరుగుతున్న వారి ఆటకట్టిస్తున్నారు.

శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యానికి కారణమవుతున్న 350 లౌడ్‌ సైలెన్సర్లను తిరుపతి పోలీసులు ధ్వంసం చేశారు. రోడ్ రోలర్లతో ఆ లౌడ్ సైలెన్సర్లను తొక్కించి ధ్వంసం చేశామని పోలీసులు వివరించారు.

మీడియాతో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలకు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే సైలెన్సర్లను అమర్చుకున్నారని అన్నారు.

అటువంటి యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. శబ్దకాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్లతో ఎక్కువసార్లు యువకులు పట్టుబడితే కేసులు పెడతామని చెప్పారు. సైలెన్సర్లను బిగించే మెకానిక్‌ల పైన కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లపై రాష్ట్ర వ్యాప్తంగానూ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా బైకర్లు వాటిని వాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు.

రాజకీయ వైరం ఉన్నా.. చంద్రబాబు ఆ విషయంలో హూందాగా వ్యవహరించారు : పేర్ని నాని