రాజకీయ వైరం ఉన్నా.. చంద్రబాబు ఆ విషయంలో హూందాగా వ్యవహరించారు : పేర్ని నాని
గోడౌన్ లో స్టాక్ తగ్గిందని సిబ్బంది చెప్తే మాకు తెలిసింది. తెలియగానే జాయిన్ కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. టెక్నికల్ గా మా తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత వహిస్తూ తగ్గిన బియ్యానికి డబ్బులు ..

YCP Leader perni nani
YCP Leader Perni Nani: కూటమి ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. నా భార్య పేరుపై ఉన్న గోడౌన్ ను రెండేళ్లుగా సివిల్ సప్లయ్ డిపార్టుమెంటుకు రెంట్ కి తీసుకున్నారు.
నేను ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను, నా భార్య ఆ గోడౌన్ కి రెగ్యులర్ గా వెళ్లింది లేదు. గోడౌన్ వ్యవహారాలన్నీ స్టాఫ్ చూసుకుంటారు. గోడౌన్ లో స్టాక్ తగ్గిందని స్టాఫ్ చెప్తే మాకు తెలిసింది. తెలియగానే జాయిన్ కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. టెక్నికల్ గా మా తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత వహిస్తూ తగ్గిన బియ్యానికి డబ్బులు లేదా బియ్యం చెల్లిస్తామని జాయిన్ కలెక్టర్ కి చెప్పాం. సివిల్ సప్లయ్ అధికారులు, జాయిన్ కలెక్టర్ కలిసి తనిఖీలు జరిపి తగ్గిన బియ్యానికి డబ్బులు కట్టించుకుని నా భార్య పై క్రిమినల్ కేసు నమోదు చేశారంటూ పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Pawan Kalyan: వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. అభిమానులపై అసహనం
నేనెక్కడికీ పారిపోలేదు..
గోడౌన్ లో తగ్గిన 3708 బస్తాలకు 1.78 లక్షలు కట్టాలని నోటీస్ ఇచ్చారు. నైతిక బాధ్యతతో మాత్రమే డబ్బులు చెల్లించాం. బియ్యం మిస్సింగ్ లో మా పాత్ర ఏ మాత్రం లేదని పేర్ని నాని చెప్పారు. బెయిల్ పిటిషన్ ను తేల్చనీయకుండా వాయిదాలు మీద వాయిదాలు తీసుకుంటున్నారు. ఏదోరకంగా నన్ను, నా భార్యను అరెస్టు చేయాలని రాజకీయ కక్షతో ఇదంతా చేస్తున్నారు. నేనెక్కడికీ పారిపోలేదు. ఇంట్లో ఆడవాళ్లపై కేసు పెట్టారు కనుక రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను పారిపోయాను అనేవాళ్లు ఇళ్లలో ఆడవాళ్లకి ఈ పరిస్థితి వస్తే రక్షించుకునే ప్రయత్నం చేయరా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. రిటైర్మెంట్ సమయంలో అద్దె వస్తుందని ఆశతో గోడౌన్ కట్టాం.. తప్పులు చెయ్యడానికి కాదు.
Also Read: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై కీలక వ్యాఖ్యలు చేసిన టీటీడీ ఈవో శ్యామలరావు
చంద్రబాబు హూందాగా వ్యవహరించారు..
నేను మంత్రిగా పని చేసిన సమయంలో ఒక్కచోట అవినీతి చేశానని రుజువు చెయ్యండి .. ప్రస్తుతం ఉన్న డీజీపీతో నేను మంత్రిగా పనిచేశాను. ఒక్క కక్కుర్తి పనిచేసినా డీజీపీ చెప్పాలి. రవాణా శాఖలో వందల మంది అధికారులు ఉన్నారు. వాళ్లను అడగండి నా వ్యక్తిత్వం గురించి చెప్పారు. చంద్రబాబు ఒక్కరే ఆడవాళ్లను అరెస్టు చేయొద్దని చెప్పినట్లు సమాచారం ఉంది. నాకు, చంద్రబాబుకు రాజకీయ వైరం ఉన్నా.. ఈ విషయంలో చంద్రబాబు హూందాగా వ్యవహరించారు. రాజకీయ కక్ష ఉంటే నన్ను, నా కొడుకును అరెస్టు చేయండి. ఆడవాళ్ల జోలికెందుకు అంటూ పేర్ని నాని అన్నారు.
నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పాలి..
గౌడౌన్ లో గంజాయి పెట్టి నాపై నెట్టడానికి కూడా పోలీసులు ప్రయత్నించారు. మా లాయర్లు అడ్డుకోవడంతో అది చెయ్యలేకపోయారని పేర్ని నాని పేర్కొన్నారు. ఈ అంశంలో బెయిల్ పిటిషన్ కోర్టులో ఉంది కనుక ఇన్ని రోజులూ మాట్లాడలేదు. నా భార్యకు బెయిల్ ముఖ్యమా.. రాజకీయ శీలం ముఖ్యమా అని ఆలోచించి మాట్లాడలేదు. ఏరోజూ నా భార్య రాజకీయాల్లోకి తొంగిచూడలేదు. నిత్యం పూజలు, దేవుళ్లు తప్ప వేరే వ్యాపకం ఆమెకు ఉండదు. దిక్కుమాలిన రాజకీయాల్లో నేను తిరగడం వల్లే నా భార్యకు ఇలాంటి అవమానం జరిగింది. నాకు జన్మనిచ్చిన తల్లిపై ప్రమాణం చేసి చెప్తున్నా.. నేను, నా భార్య ఎలాంటి తప్పు చేయలేదు. ధాన్యం తగ్గితే డబ్బులు కట్టించుకుంటారు తప్పితే క్రిమినల్ కేసులు నమోదు చేసింది లేదు. 2014 నుండి ఇప్పటి వరకూ ధాన్యం తగ్గిన రైస్ మిల్లర్ లపై క్రిమినల్ కేసులు ఎక్కడ నమోదు చేశారో మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పాలి. ధాన్యం మిస్సింగ్ లో డబ్బులు ఎగొట్టిన రేషన్ షాపులు, మిల్లర్లు, గోడౌన్ లపై ఎన్ని క్రిమినల్ కేసులు నమోదు చేసారో మంత్రి చెప్పాలి అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.