Tirupati : రుయాలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం, సీఎం జగన్ ఆరా

రుయా ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Ruia Hospital : రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పలువురు రోగులు చనిపోయారనే వార్త కలకలం రేపుతోంది. 2021, మే 10వ తేదీ సోమవారం సాయంత్రం ఐసీయూలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ పై చికిత్స పొందుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బాధితులు ఊపిరాడక అల్లాడారు. అత్యవసర శ్వాస ఆడించేందుకు వైద్యులు సీపీఆర్‌ చేశారు. రోగులకు గాలి ఆడేందుకు బంధువులు అట్టముక్కలతో విసరడం కనిపించింది. ఆక్సిజన్ కొరత వల్లే ఇది జరిగిందని రోగుల కుటుంబసభ్యులు వైద్యాధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. తమ వాళ్లు చనిపోయారని కొంతమంది వెళ్లడిస్తున్నారు.

మరోవైపు ఈ విషయం సీఎం జగన్ కు తెలిసింది. ఈ ఘటనపై ఆరా తీశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఆక్సిజన్ అందక దాదాపు 10 మంది దాక చనిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది ? తదితర వివరాలు అధికారికంగా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.

Read More : Oxygen Shortage : రుయా ఆసుపత్రి వద్ద ఆర్తనాదాలు, ఆక్సిజన్ అందక పలువురి మృతి?

ట్రెండింగ్ వార్తలు