Tirupati sculptures In TS new Secretariat
Tirupati sculptures In TS new Secretariat : TRS ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో తిరుపతి శిల్పాలు కొలువు దీరనున్నాయి. గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి,శివలింగం, సింహం, నంది విగ్రహాలు తయారు చేసి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం టీటీడీని సంప్రదించింది. గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అభయాంజనేయస్వామి, శివలింగం, సింహ, నంది, తదితర రాతి శిల్పాలు తయారు చేసి అందజేయాలని కోరింది. దీనికి టీటీడీ అంగీకరించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం శిల్పకళా సంస్థలో ఈ విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. కృష్ణ శిలలతో ఈ దేవతామూర్తులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ విగ్రహాలు తెలంగాణ కొత్త సచివాలంలో కొలువుతీరనున్నాయి. తిరుపతిలోని ఎస్వీ సంప్రదాయ ఆలయనిర్మాణ, శిల్పకళా సంస్థ ద్వారా ఆరు విగ్రహాలు తయారు చేసి అందించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ శిల్పాల తయారీ కోసం టీటీడీ తమిళనాడులోని కంచి ప్రాంతంలో లభ్యమయ్యే కృష్ణశిలలను తెప్పించింది.
ప్రభుత్వం కోరిన శిల్పాల్లో ప్రస్తుతానికి అభయాంజనేయస్వామి, సుబ్రమణ్యస్వామి విగ్రహాలు దాదాపు పూర్తికాగా..ఈ దేవతామూర్తులకు కళాకారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. మిగిలిన విగ్రహాలు కూడా త్వరలోనే పూర్తికానున్నాయి. ఇప్పటికే గణపతి, సింహ, నంది విగ్రహాలు, శివలింగం తయారీ పనులు మొదలుకాగా వచ్చే నెల (2023) మొదటివారంలో విగ్రహాలు పూర్తి అయి త్వరలోనే ఈ విగ్రహాలను తెలంగాణ ప్రభుత్వానికి అందజేయనుంది టీటీడీ.