Representative image
Tirupati: తిరుపతి జిల్లా కేవీబీ పురంలో 5 నెలల క్రితం 18 ఏళ్ల యువకుడు 15 ఏళ్ల బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత యువకుడు తన భార్యతో కలిసి ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాడు. ఇదే ఇంట్లో అతడి భార్య తల్లి కూడా ఉండేది. ఆమె భర్త కొన్ని రోజుల క్రితం మరణించడంతో కూతురు, అల్లుడు దగ్గరే జీవనం సాగిస్తోంది.
ఇంతలో అల్లుడు, అత్త మధ్య అనైతిక సంబంధం ఏర్పడింది. రోజురోజుకూ వారి సంబంధం బలపడింది. చివరికి అల్లుడు తన భార్య కళ్ల ముందే అత్తకు తాళి కట్టి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. (Tirupati)
Also Read: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వారికి వారం రోజులు సెలవులు.. కలెక్టర్ ఆర్డర్స్
ఆమె మెడలో తాళి కట్టేందుకు యువకుడు సిద్ధం అవుతుండగా భార్య అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయితే, ఆ యువకుడు ఆగ్రహించి ఇంట్లో ఉన్న రోకలి బండతో భార్యపై దాడి చేశాడు.
ఘటనా స్థలంలో భార్య తీవ్రంగా గాయపడింది. ఆమె కేకలు విన్న పొరుగువారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అతడి భార్యను సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, స్థానికులు ఆగ్రహంతో యువకుడిని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.