Tirupati
Tirupati : తిరుపతి నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట పారిపోయి తిరుపతికు వచ్చింది. తల్లిదండ్రులు తమ పెళ్లి చేయరని నిర్ణయించుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.
ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందిన వెంకటరాజు, అనూషలుగా గుర్తించారు. లాడ్జిలో సూసైడ్ లేఖను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.