Nallagatla Swamidas
Tiruvuru YCP Candidate Nallagatla Swami Das : త్వరలో జరగబోయే ఎన్నికలు పేద ప్రజలకు పెట్టుబడిదారులకు మధ్య జరిగే యుద్ధం లాంటివి. ఆ యుద్ధంలో అంతిమ విజయం పేద ప్రజలదే.. అంటే వైసీపీదే అని తిరువూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. సీఎం జగన్ అత్యధిక మెజార్టీతో మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాక్షసుల సంహారం ఏకమై వస్తున్నాయి. రాముడిలా బాణం వదులుతాం.. సీఎం జగన్ రాముడిలా వదిలిన బాణమే నేను. నేను ఏనుగు లాంటివాడిని కుక్కలు ఎన్నో మొరుగుతాయి ఐ డోంట్ కేర్ అంటూ స్వామి దాస్ వ్యాఖ్యానించారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేసే వ్యక్తిని నేను అని అన్నారు.
Also Read : CM Jagan : విశాఖ రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. అమరావతికి వ్యతిరేకం కాదని వెల్లడి
చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాడు ఎలక్షన్ కోసం రాలేదు.. కలక్షన్ కోసం వచ్చాడు.. అతని జీవితం మొత్తం కలెక్షన్ కింగ్, చందాలు అడుక్కునే వ్యక్తి అంటూ తన ప్రత్యర్థిపై స్వామిదాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడి నుంచి వచ్చాడు అతను.? ముప్పేఏళ్లు నాతోపాటు ఉన్న టీడీపీ నాయకులు మాట్లాడాలి.. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి కాబట్టి. తిరువూరు నియోజకవర్గంలో ఏదైనా సమాచారం, సమస్యలు కానీ, హద్దులు కానీ అతనికి తెలుసా? గుంటూరు జిల్లా నుంచి ఇక్కడకు వచ్చి అతను ఇక్కడ తాతకు దగ్గులు నేర్పినట్లు ఉంది అంటూ స్వామిదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఆత్మవిశ్వాసం కలవాడిని. 30ఏళ్ల నుండి ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడే ఉన్నా. నా జీవితం ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడే ముగుస్తుంది. నాది తెరిసిన పుస్తకం అని స్వామిదాస్ పేర్కొన్నారు.
Also Read : Chandrababu Naidu : టీడీపీ-జనసేన పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కొల్లేరుకు వచ్చినట్లు వలస పక్షులు వస్తాయి, పోతాయి.. తాను మాత్రం ఇక్కడే ఉంటా. దళిత వర్గంలో పుట్టి ప్రజాసేవకోసం గెజిటెడ్ హోదాలనుసైతం వదలుకున్నాం. ఈ నియోజకవర్గంలో టీడీపీ – జనసేన బలపర్చిన అభ్యర్థి నన్ను, సుధారాణిలను దూషిస్తే ఫేమస్ కావచ్చు అనే దురుద్దేశంతోనే మాట్లాడుతున్నాడు. అంగన్వాడీ వాళ్ల దగ్గర మేము డబ్బులు తీసుకున్నామని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. తిరువూరు నియోజకవర్గంలో ఎవరైనా అడిగితే జవాబుదారుగా సమాధానం చెబుతాం. అంతేతప్ప, గుంటూరు నుంచి వచ్చి తిరువూరు నియోజకవర్గం ఎల్లలు తెలియని వారికి మేం సమాధానం చెప్పే స్థితిలో లేమని స్వామిదాస్ అన్నారు.