Dwaraka Tirumala : ఇంటి వద్దే కారు ఉంది..అయినా..టోల్ ఫీజు కట్

ఇంటి వద్దే కారు ఉంచాడు. అయినా..టోల్ ఫీజు కట్ అయినట్లు సెల్ ఫోన్ కు మెసేజ్ రావడంతో ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటూ బుర్రగొక్కుంటున్నాడు.

Toll Collection Fastag : ఇంటి వద్దే కారు ఉంచాడు. అయినా..టోల్ ఫీజు కట్ అయినట్లు సెల్ ఫోన్ కు మెసేజ్ రావడంతో ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటూ బుర్రగొక్కుంటున్నాడు. కనీసం కారు రోడ్డు మీదకు తీయకుండానే…టోల్ రుసుం వసూలు చేయడంపై అతను ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాడు. ఈ ఘటన ఏపీలోని ద్వారకా తిరుమలలో చోటు చేసుకుంది.

Read More : Voters List Draft : తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల

ద్వారకా తిరుమలలో ఒబిలిశెట్టి గంగరాజు కుమార్ నివాసం ఉంటున్నారు. ఇతనికి ఏపీ 37 సీఏ 4747 నెంబర్ గల రెనాల్డ్ స్కాలా కారు ఉంది. 2021, నవంబర్ 01వ తేదీ సోమవారం ఉదయం 11.23 గంటలకు సెల్ ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. దీనిని పరిశీలిస్తే..తన కారుకు ప్రకాశం జిల్లా మేకలవారిపల్లి టోల్ ప్లాజా నుంచి ఫాస్టాగ్ ద్వారా..రూ. 40 టోల్ ఫీజు కట్ అయినట్లు మేసెజ్ సారాంశం. అయితే..కారు తనింట్లో ఉంది. మరి టోల్ ఫీజు ఎలా కట్ అయ్యిందంటూ ఆలోచించాడు. అసలు టోల్ ఎలా కట్ చేశారో తెలియక అయోమయంలో పడిపోయాడు. రూ. 40 కోసం కాదు..అసలు కారు రోడ్డు మీదకు తీయకుండానే…టోల్ ఫీజు ఎలా కట్ అయ్యిందో తేల్చాలని అధికారులను కోరుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు