ఇవాళే జగన్ దగ్గరకు టాలీవుడ్ ప్రముఖులు.. వెళ్లేది వీళ్లే!

  • Publish Date - June 9, 2020 / 03:02 AM IST

ఇప్పటికే కొన్నినెలలుగా సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ(09 మే 2020) సీఎం జగన్ తో భేటీ అవుతున్నారు. జగన్‌తో సమావేశం అయ్యేందుకు పెద్దలు సిద్ధం అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగబోతుంది. 

ఈ భేటికి చిరంజీవి, నాగార్జున, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు, థియేటర్లలో ప్రదర్శనలు, మరికొన్ని సమస్యలపై వారు సీఎంతో చర్చిస్తారు. వాస్తవానికి పాతిక మంది వరకు డెలిగేషన్ వెళ్లి జగన్‌ను కలవాలని భావించినా.. సీఎంఓ ఆఫీసు నుంచి కొద్దిమంది రావాలని కోరినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దామోదర్ ప్రసాద్, సి. కళ్యాణ్, దిల్ రాజు, సురేష్ బాబు, నారాయణ్ దాస్ నారంగ్‌లను ఫైనల్ జాబితాలో చేర్చినట్లు చెబుతున్నారు. సినిమా షూటింగ్‌లు, సినిమా హాళ్లు తెరిచే విషయమై సినీ పరిశ్రమకు చెందిన వారు జగన్‌తో చర్చించనున్నారు. అలాగే టీవీ సీరియల్స్ షూటింగ్‍లకు కూడా అనుమతి ఇవ్వాలని జగన్‍ను విజ్ఞప్తి చేయనున్నారు.

Read: వంట మాస్టర్ గా ఆసిన్ కూతురు