×
Ad

Tomato Rates: టమాటా ధరలు ఢమాల్.. ఒక్కసారిగా పడిపోయిన రేట్లు.. కిలో ఎంతంటే..

దసరా ముందు వరకు కిలో టమాటా ధర ఇక్కడ రూ.8-10 ఉండేది.

Tomato Price

Tomato Price: టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, పత్తికొండ మార్కెట్‌లో కిలో టమాట ధర రూ.4కి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మార్కెట్‌ కమీషన్‌తో పాటు కోత కూలీలు, రవాణా ఖర్చులు చెల్లించామని అవన్నీ లెక్కేసుకుంటే టమాటా కిలో రూ.1 పలికినట్లు అయిందని రైతులు చెప్పారు.

టమాటాలు అన్నీ రోడ్డుపై పారబోశారు. రైతుల ఆందోళనతో గుత్తి-మంత్రాలయం రహదారిలో నిన్న ట్రాఫిక్‌ కాసేపు జామ్ ఏర్పడింది. గిట్టుబాటు ధర కల్పించాలని రైతలు డిమాండ్ చేశారు.

Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గెట్‌ రెడీ.. ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు!

అలాగే, టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని త్వరగానే పూర్తి చేయాలని అన్నారు. 10 కిలోల టమాటా గంపలు రెండింటికి రూ.80-రూ.100 మధ్య ధర పలికిందని చెప్పారు. మార్కెట్లో వ్యాపారులు 25 కిలోల గంపలను రెండింటిని రూ.180 కనిష్ఠ ధరకు కొన్నారని తెలిపారు.

విజయ దశమని సందర్భంగా ఈ నెల 1, 2న మార్కెట్‌కు సెలవు ఉంది. 2 రోజుల నుంచి కోతకు సిద్ధంగా ఉన్న వాటిని మార్కెట్‌కి తీసుకురాగా, మార్కెట్‌కు 5.5 టన్నులు దాటి అమ్మకానికి వచ్చాయి. శనివారంతో పాటు ఆదివారం కూడా వ్యాపారులు అతి తక్కువ ధరకు టమాటాలను కొనుగోలు చేశారు. దసరా ముందు వరకు కిలో టమాటా ధర ఇక్కడ రూ.8-10 ఉండేది.