Tomato Price : టమాటా ధరకు మళ్లీ రెక్కలు..కేజీ ఎంతో తెలుసా?

రైతుల దగ్గర తక్కువ ధరకు కొని డబుల్ రేట్లకు విక్రయిస్తున్నారు. మదనపల్లె మార్కెట్ కు భారీగా సురుకు చేరుకుంటుంది. పెరుగుతున్న ధరతో రైతుల్లో సంతృప్తి వ్యక్తం అవుతుంది.

Tomato prices : టమాటా ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులను టమాట ధర బెంబేలెత్తిస్తోంది. కేజీ టమాటా ధర దాదాపు సెంచరీ కొట్టింది. బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.80-100 పలుకుతోంది. మదనపల్లె మార్కెట్ లో కిలో టమాటా రూ.60 పలుకుతోంది.

రైతుల దగ్గర తక్కువ ధరకు కొని డబుల్ రేట్లకు విక్రయిస్తున్నారు. మదనపల్లె మార్కెట్ కు భారీగా సురుకు చేరుకుంటుంది. పెరుగుతున్న ధరతో రైతుల్లో సంతృప్తి వ్యక్తం అవుతుంది. పంట దిగుబడి తగ్గడం వల్లే ధర పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయి.

Cm Stalin : టమాటా ధరల కట్టడికి సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం..మార్కెట్ లో దిగివచ్చిన ధరలు

గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ లో ఏ వస్తువు రేటు చూసినా మండిపోతుంది. దీనికి తోడు తాజాగా టమాటా రేటు కూడా పెరగడంతో సామాన్యులపై అధిక భారం పడనుంది. వేసవి కాలం ఎండల్లాగా నిత్యవసర సరుకులు ధరలు కూడా మండిపోతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు