Tomato
Tomato – Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా(Annamayya district), మదనపల్లె (Madanapalle) వ్యవసాయ మార్కెట్ యార్డులో కిలో టమాటా దాదాపు రూ.50కే లభ్యమవుతోంది. జులై 30న ఆ మార్కెట్లో ఎన్నడూలేనంతగా కిలో టమాటా అత్యధికంగా రూ.196 పలికింది.
వారం రోజుల నుంచి ఆ మార్కెట్ కు సరఫరా కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తోంది. దీంతో నిన్న కిలో టమాటా రూ.100 పలికింది. ఇవాళ సగానికి సగం ధర పడిపోయింది. ఆ మార్కెట్లో ఏ గ్రేడ్ టమాటాలు కిలో రూ.50 – రూ.64 మధ్య అమ్ముడుపోయాయి. అలాగే, బీ గ్రేడ్ టమాటాలు రూ.36 – రూ.48 మధ్య ఉంది. మొత్తానికి సగటున కిలో టమాటా రూ.44 – రూ.60 మధ్య రైతులు అమ్ముతున్నారు.
దిగుబడి పెరిగి వ్యాపారులకు తక్కువ రేటుకే టమాటాలు దక్కుతుండడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టమాటా ధరలు అతి భారీగా పెరగడంతో ప్రజలు కొన్ని వారాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.
టమాటాలు లేకుండానే కూరలు వండుకుంటున్నారు. హోటళ్లలోనూ టమాటాల వాడకాన్ని తగ్గించేశారు. మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలు అన్ని మార్కెట్లలోనూ చోటుచేసుకుంటాయనే ఆశాభావం వ్యక్తమవుతుంది.