Kadapa: కడప జిల్లాలో విషాదం.. రైలు కింద పడి విద్యార్థినులు ఆత్మహత్య

ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థినులు రైలు కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నారు.

Kadapa District Students

Kadapa: కడపలో ఎర్రముక్కపల్లిలో విషాదం చోటుచేసుకుంది. యాడికి మండలానికి చెందిన ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థినులు రైలు కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నారు. మృతులను కల్యాణి, పూజితగా పోలీసులు గుర్తించారు.

వీరిద్దరు గేట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో ఈసీఈ చదువుతున్నారు. పోస్టుమార్టం కోసం ఇద్దరి మృతదేహాలను రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వారి ఆత్మహత్యకు కారణం ఏంటీ? అనే విషయం తెలియాల్సి ఉంది.