ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. ముగ్గురి మృతి.. 18 మందికి గాయాలు

వాహనాల్లోనే మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్‌ సాయంతో వాటిని బయటకు తీశారు. మృతులు ఎవరన్న విషయాన్ని ఇంకా గుర్తించలేదు.

Road Accident

ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డలో ఆల్ఫా కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు పరస్పరం ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.

Also Read: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు.. విజయవాడలో చంద్రబాబు, కాకినాడలో పవన్ జెండా ఆవిష్కరణ

క్షతగాత్రులను మూడు అంబులెన్సులలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగన్ ట్రావెల్స్‌ బస్సును శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది.

దీంతో శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సులోని ఇద్దరు, జగన్‌ ట్రావెల్స్ బస్సులోని ఒకరు మృతి చెందారని పోలీసులు గుర్తించారు. వాహనాల్లోనే మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్‌ సాయంతో వాటిని బయటకు తీశారు. మృతులు ఎవరన్న విషయాన్ని ఇంకా గుర్తించలేదు.