Ravikumar Comments : ఏపీ జేఏసీ నేతలపై ట్రెజరీ ఉద్యోగుల సంఘం నేత రవికుమార్ సంచలన వాఖ్యలు

ఏపీలో డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసి, ఏపీ అమరావతి జేఏసి ఉద్యోగ సంఘాలు పోరు బాట పట్టాయి. జేఏసీ నేతలపై ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ravikumar comments on AP JAC leaders : ఆంధ్రప్రదేశ్ లో డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. మొత్తం 71 డిమాండ్లతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లు ఏపీ జేఏసి, ఏపీ అమరావతి జేఏసి ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఉద్యమ బాట పట్టిన జేఏసీ నేతలపై ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవి కుమార్ సంచలన వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాల్లో ట్రెజరీ ఉద్యోగస్తులు పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కడప జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంపై నమ్మకంతో ఉన్నామని తెలిపారు.

సీఎం చెప్పిన సమయం లోపు పీఆర్సీపై ప్రకటన రాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. చంద్రశేఖర రెడ్డి ఉగ్యోగుల తరపున వారధిగా ఉండి ఉపయోగమేమిటని ప్రశ్నించారు. చంద్రశేఖర రెడ్డి మాట కూడా ఇరు జేఏసీలు వినకపోవడం హాస్యాస్పదమన్నారు. బొప్పరాజు, బండి శ్రీనివాస్ ఇద్దరు బంధువులని వెల్లడించారు. బొప్పరాజుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావాలని, బండి శ్రీనివాస్ రజక కార్పొరేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారని తమ ఉద్యోగుల్లో వినికిడని అన్నారు. ప్రభుత్వంపై వీరిద్దరూ ఒత్తిడి తెస్తోంది.. అందుకు కాదా అని నిలదీశారు.

Andhra Pradesh: రూ.15వందల కోట్ల గంజాయిని ధ్వంసం చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు నేటి నుంచి 10వ తేదీ వరకు నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరు కానున్నారు. పదో తేదీ నుంచి నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేస్తూ.. భోజన విరామంలో ఆందోళన చేపట్టనున్నారు. ఇటీవల అమరావతి సచివాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన కార్యదర్శుల సమావేశంలో కూడా ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వం నుంచి స్పష్టతా రాలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం 3 జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించింది.

ప్రతి సమావేశంలోనూ సంఘాలు 11వ పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో 13వ తేదీన నిరసన ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నారు. 16వ తేదీన ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అన్ని తాలూకా, డివిజన్, HOD కార్యాలయాలు, ఏపీఎస్‌ఆర్‌టీసీ డిపోల వద్ద ధర్నాలు నిర్వహించనున్నారు.

Vaccination in Telangana: వంద శాతం వ్యాక్సినేషన్ దిశగా తెలంగాణ

ఈ నెల 21వ తేదీన జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ధర్నాలు నిర్వహించనున్నారు. 27వ తేదీ నుంచి జనవరి 2వ తేది వరకు అన్ని డిజిజన్ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. 27వ తేదీన విశాఖపట్నం, 30వ తేదీన తిరుపతి, జనవరి 3వ తేదిన ఏలూరు, జనవరి 6వ తేదిన ఒంగోలు ప్రాంతాల్లో డివిజన్ లెవెల్ సమావేశాలు నిర్వహించనున్నారు.

మరోవైపు ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ ఉద్యమాన్ని కొన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ది పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయిస్ అసోషియేషన్, ఆంధ్రప్రదేశ్ గజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఈ నిరసనలను వ్యతిరేకిస్తున్నాయి. సీఎం జగన్ ఉద్యోగుల సంక్షేమంపై, డిమాండ్లపై హామీ ఇచ్చినా ఆందోళన చేయడం అర్థరహితమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే జేఏసీ నేతలు తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదంటూ ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవి కుమార్ వాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు