BJP MLA Raja Singh
BJP MLA Raja Singh : తెలంగాణకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హిందువులకు గాని హిందూ దేవాలయాలకు గాని రక్షణ లేదని ఆయన అన్నారు. ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం లో స్వామి వారిని దర్శించుకున్నారు.
రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. శ్రీశైలంలో అన్యమతస్తుల వ్యాపారాలు, వారి జనాభా రోజు రోజుకూ పెరుగుతోందని ఆయన తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో జీవో నెం.426 తీసుకువచ్చి భక్తుల మనోభావాలు కాపాడారని గుర్తుచేశారు.
Also Read : Vizianagaram : బొత్స దంపతుల కాళ్లు మొక్కిన జాయింట్ కలెక్టర్
శ్రీశైలంలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయడం వల్ల శ్రీశైల దేవాలయం గౌరవ మర్యాదలు దెబ్బతింటున్నాయని.. దీనిని ఎండోమెంట్ కమిషనర్… ఇతర అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు రాజాసింగ్ ఆరోపించారు.