Vizianagaram : బొత్స దంపతుల కాళ్లు మొక్కిన జాయింట్ కలెక్టర్

నూతన సంవత్సర వేడుకల వేళ విజయనగరం జిల్లాలో జాయింట్ కలెక్టర్ చర్య  వివాదాస్పదoగా మారింది.

Vizianagaram : బొత్స దంపతుల కాళ్లు మొక్కిన జాయింట్ కలెక్టర్

Vizianagaram Botsa

Updated On : January 2, 2022 / 1:37 PM IST

Vizianagaram :  నూతన సంవత్సర వేడుకల వేళ విజయనగరం జిల్లాలో జాయింట్ కలెక్టర్ చర్య  వివాదాస్పదoగా మారింది. జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్ కిషోర్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేయటానికి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్శారు.

అక్కడ మంత్రి దంపతులకు పుష్పగుఛ్ఛం  ఇచ్చి….మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన భార్య ఝూన్సీ కాళ్లకు దండం పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక  ఐఏఎస్ అధికారి మంత్రికి, అతని భార్య కాళ్లకు దండం పెట్టడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ఈచర్య జిల్లాలో కింద స్థాయి ఉద్యోగుల వద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read : YS Jagan Mohan Reddy : రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి