TTD
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్‌కు ఇవాళ ఆమోదముద్ర పడింది. బడ్జెట్ రూ.5,258.68 కోట్లుగా నిర్ణయించారు. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అలాగే, ఒంటిమిట్ట కోదండరామ బ్రహ్మోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు.
“సీఎం చంద్రబాబు నాయుడు 21 తేదీన కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేశాం. 50 ఎకరాలు టీటీడీ స్వాధీనం చేసుకుంటుంది. ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి..
శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ వేస్తున్నాం. శ్రీవారి భూముల కేసులు న్యాయస్థానాల్లో వాటిని త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. టీటీడీ ఉద్యోగులు హిందువు అయి ఉండాలి. అన్ని రాష్ట్రాల రాజధానిలో ఆలయాల నిర్మాణం చేస్తాం. ఒకటిన్నర ఏడాది కొన్ని ఆలయాలు నిర్మాణం చేయాలని బోర్డు సంకల్పంతో ఉంది.
అమరావతిలో శ్రీనివాస కల్యాణం గొప్పగా నిర్వహించారు. శ్రీనివాస కల్యాణం ఘనంగా నిర్వహించారని సీఎం చెప్పారు. పోటు కార్మికులకు ఇచ్చే 43 వేలు జీతంలో జీఎస్టీ కట్ చేస్తున్నారు. ఐదు వేలు రూపాయలు జీఎస్టీ పెట్టుకోకుండా నిర్ణయం తీసుకున్నాం. సైన్స్ సిటీకి 20 ఎకరాలు కేటాయించాం. సైన్స్ సిట్ ఎలాంటి నిర్మాణాలు చేయకపోవడంతో వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం.
తిరుమలలో అనధికార హకర్లపై చర్యలు తీసుకుంటాం. త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన సమయ మార్పు చేస్తాం. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రయోగాత్మకంగా ట్రయల్ నిర్వహణ ఉంటుంది” అని బీఆర్ నాయుడు చెప్పారు.
మరిన్ని నిర్ణయాలు
రాబడి అంచనాలు
బడ్జెట్ కేటాయింపులు