TTD Board Key Decisions: టీటీడీలో సైబర్ సెక్యూరిటీ, 600 మందికి నిరుద్యోగ భృతి, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు- టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

750 మంది వేద పారాయణం చేసే వారిని నియమించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.

TTD Board Key Decisions: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో సాధారణ భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నడక మార్గాల్లో వచ్చే భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. శ్రీవారి సేవలో సంస్కరణలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు టీటీడీలో సైబర్ సెక్యూరిటీ ఏర్పాటునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 600 మంది వేద పండితులకు నిరుద్యోగ భృతి, 750 మంది వేద పారాయణం చేసే వారిని నియమించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో పాత నిర్మాణాలను తొలగించి కొత్తవి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

వీకెండ్స్ లో లేదా పర్వదినాల్లో ఎక్కువగా భక్తులు వస్తుంటారు. క్యూలైన్ లో వారి వెయిటింగ్ టైమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 8 గంటలు 10 గంటలు వేచి ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. క్యూలైన్ లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని నివారించేందుకు చర్యలు చేపడతాం. కంఫర్టబుల్ గా కూర్చుని వారి సమయం వచ్చినప్పుడు దర్శనానికి వెళ్లేలా చేయడానికి చర్యలు తీసుకుంటాం. క్యూలైన్లు బయటకు వెళ్లేది సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే. దీనిపై ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, దీని వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది పరిశీలించడానికి ఒక కమిటీ వేసి దానిపై నిర్ణయం తీసుకుంటాం.

Also Read: కడప సెంట్రల్ జైల్లో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు.. కారణం ఏమిటంటే..

300 రూపాయల టికెట్ తీసుకున్న వారు, శ్రీవాణి టికెట్ తీసుకున్న వారు కూడా క్యూలైన్ లో వేచి ఉండాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వేచి ఉండాలి అనేది ప్రశ్నగా ఉంది. వారందరికి ఎటువంటి వసతి లేదు. వెయిట్ చేయడానికి, కూర్చోవడానికి లేదు. సౌకర్యవంతంగా కూర్చునేలా చూడాలని చాలా మంది అడుగుతున్నారు. శ్రీవారి మెట్టు, నడక మార్గాల్లో చాలా మంది నడిచి వస్తుంటారు. వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా మౌలిక వసతులు పెంపొందించాల్సిన అవసరం ఉంది” అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.

 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి దాదాపుగా 2.30 గంటల వరకు జరిగింది. ఆ తర్వాత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తాము తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు ఉన్నాయి. మూడో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించాల్సిన అవసరం ఉందా? లేదా? అనేదానిపై ఒక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

రెండు నడక దారుల్లో (అలిపిరి మెట్లమార్గం, శ్రీవారి మెట్టు) భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, వసతి సౌకర్యాలకు పెంచాలని నిర్ణయించారు. టీటీడీ వెబ్ సైట్ అనుకుని భక్తులు తరుచుగా మోసపోతున్నారు. ఇక టీటీడీపై దుష్ప్రచారం చేసే వారిని గుర్తించేందుకు సైబర్ సెక్యూరిటీ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలోని అన్యమత ఉద్యోగులపై నిఘా పెంచాలని, ఏ మాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయం తీసుకున్నారు. హుండీ నుంచి వచ్చే కానుకలను జీతాలుగా తీసుకుని ఇతర మతాలను అనుసరించడం తాము సహించబోము అని టీటీడీ ఛైర్మన్ స్పష్టం చేశారు.