టీటీడీ వార్షిక బడ్జెట్‌ 2024- 25కు పాలకమండలి ఆమోదం

తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ 2024- 25కు పాలకమండలి సోమవారం ఆమోదం తెలిపింది.

TTD

TTD budget 2024- 25: తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ కు పాలకమండలి సోమవారం ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో 2024-25 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూపొందించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనాల ద్వారా 338 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది.

సాధారణంగా టీటీడీ వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఆమోదిస్తుంటారు. అయితే ఈసారి జనవరిలోనే వార్షిక బడ్జెట్‌ను టీటీడీ పాలకమండలి ఆమోదించింది. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావొచ్చన్న అంచనాలతో ముందుగానే వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు.

టీటీడీ వార్షిక బడ్జెట్ ఆదాయం అంచనాలు
హుండీ ఆదాయం రూ.1611 కోట్లుగా అంచనా
వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల ద్వారా రూ.1167 కోట్ల వడ్డీ రాబడి
ఇతర పెట్టుబడిల ద్వారా రూ.129 కోట్లు ఆదాయం
ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.338 కోట్లు ఆదాయం

Also Read: అయోధ్య రామమందిరం దర్శన సమయాలేంటి? ఎలా చేరుకోవాలి? సందర్శకుల ప్రశ్నలకు సమాధానాలివే!

టీటీడీ వార్షిక బడ్జెట్ కేటాయింపులు
ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1733 కోట్లు
నిత్యవసరాలు కొనుగోళ్లకు రూ.751 కోట్ల కార్పస్ ఫండ్
ఇతర పెట్టుబడులకు రూ.750 కోట్లు
ఇంజనీరింగ్ పనులకు రూ.350 కోట్లు
శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ కు రూ. 53 కోట్లు
స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి పనులకు రూ.60 కోట్లు
ఇంజనీరింగ్ మెయిన్టనెన్స్ పనులకు రూ.190 కోట్లు