Bhumana Karunakar Reddy
TTD Chairman: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీటీడీ పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తెలిసింది వెన్నుపోటు, పన్ను పోటు మాత్రమే అన్నారు. తన జీవితం అంతా దుర్మార్గాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆదర్శ ప్రాయుడు కాని రాజకీయ వేత్త చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆందోళనలుచేస్తే చంద్రబాబుకు సానుభూతి రాదు. దేశంలో ప్రజాదరణ లేని నేత చంద్రబాబు నాయుడు అంటూ భూమన విమర్శించారు. చంద్రబాబు నాయుడుపై నక్సలైట్ల దాడి జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన చిత్తుగా ఓడిపోయారు. చంద్రబాబు జీవితం కళంకితం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Nandamuri Balakrishna: పది నిమిషాలైన చంద్రబాబును జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసులో అరెస్ట్
చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ను ఒక వీరుడుగా ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు జీవితం అంతా మచ్చలే. ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నావని కాదు, ఎంత నిజాయితీగా ఉన్నావన్నది ముఖ్యం అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోనియాతో కలిసి, సీబీఐని ఉసిగొలిపి, తప్పుడు కేసులు మోపి జగన్ ను చంద్రబాబు జైలుకు పంపారు. తప్పు చేసినందుకు చంద్రబాబుకు పడిన శిక్ష ఇది అన్నారు.
Pathuri Nagabhushanam : చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు : పాతూరి నాగభూషణం
సీఐడీని అభినందించాలి. అవినీతి పరుడిని సమర్థించే వారంతా చట్టం ముందు దోషులే. ఇంకాచాలా ఉన్నాయి. ఇంతకంటే పెద్ద తప్పులు, నేరాలు చంద్రబాబు చేశారు. తన బాధను అందరి బాధలా మార్చాలని చూస్తున్నాడు చంద్రబాబు. ఆయన అరెస్ట్ చట్టబద్దం. పెగాసస్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపైకూడా మరింత విచారణ జరపాల్సి ఉంది. చంద్రబాబు అరెస్టును సమర్ధిస్తున్న పవన్ కల్యాణ్ ను ఏమనాలి. అంటే పవన్ అవినీతికి వత్తాసు పలుకుతున్నాడా? అంటూ కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.