TTD Calendar 2023: భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. ఇలా సొంతం చేసుకోండి ..

టీటీడీ అందించే డైరీలు, క్యాలెండర్లకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులు అధికశాతం మంది వీటిని తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. వచ్చే ఏడాది (2023)కి సంబంధించి డైరీలు, క్యాలెండర్లను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది.

ttd dairy

TTD calendar 2023: ప్రతీయేటా నూతన సంవత్సరానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డైరీలు, క్యాలెండర్లను అందుబాటులోకి తెస్తుంది. టీటీడీ అందించే డైరీలు, క్యాలెండర్లకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులు అధికశాతం మంది వీటిని తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. వచ్చే ఏడాది (2023)కి సంబంధించి డైరీలు, క్యాలెండర్లను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. వీటిని తిరుపతిలోనూ, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు. ఆన్ లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. డీడీ తీసి వీటిని సొంతంచేసుకోవచ్చు.

TTD DIARIES RELEASED

♦  టీటీడీ ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉంచారు.

♦  తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయ‌శాలలతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద గల ధ్యాన మందిరం, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద గల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉంచారు.

♦  విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టీటీడీ శ్రీవారి భక్తులకోసం అందుబాటులో ఉంచింది.

♦  ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపాల్లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి.

♦  ఆన్‌లైన్‌లోనూ క్యాలెండర్లు, డైరీలను భక్తులు బుక్ చేసుకొనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.

♦  భక్తులు  tirupatibalaji.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో పబ్లికేషన్స్‌ను క్లిక్ చేసి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డర్లు చేయవచ్చు.

♦  డీడీ తీసికూడా పంపొచ్చు. ఇందుకోసం కార్యనిర్వహణాధికారి, టీటీడీ తిరుపతి పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్ లెటర్‌తో కలిపి ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కేటీ రోడ్, తిరుపతి అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

♦  ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు ద్వారా భక్తులకు టీటీడీ క్యాలెండర్, డైరీలను పంపడం జరుగుతుంది. రవాణా ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది.

♦  క్యాలెండర్, డైరీలకు సంబంధించి ఇరత సమాచారం కోసం 9963955585, 0877-2264209 నంబర్లలో సంప్రదించవచ్చు.

ధరలు ఇలా ఉన్నాయి…

– 12 పేజీల క్యాలెండర్ రూ.130/-

– డీలక్స్ డైరీ రూ.150/-

– చిన్న డైరీ రూ.120/-

– టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ.75/-

– శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20 /-

– శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20 /-

– శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15 /-

– తెలుగు పంచాంగం క్యాలెండర్ – రూ.30/-