Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి

తిరుమలలో వంద మంది శ్రీవారి సేవకుల వినియోగం ద్వారా రోజు వెయ్యి కేజీల జీడిపప్పు బద్దలు అందివ్వడం జరుగుతుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి నిత్యం రెండున్నర నుండి మూడు వేల కేజీల జీడిపప్పు అవసరం ఉంటుందని తెలిపారు.

Thirumala cashew : తిరుమలలో జీడిపప్పు బద్దలు తయారీని ఇవాళ టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ప్రారంభించారు. శ్రీవారి సేవకులతో కలిసి జీడిపప్పు బద్దలు తయారీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్దలు చేసిన జీడిపప్పును స్వామివారి ప్రసాదాల తయారీలో వినియోగిస్తామని చెప్పారు. జీడిపప్పు బద్దలు దొరకడం కష్టంగా ఉండడంతో శ్రీవారి సేవకులతో జీడిపప్పు బద్దలు చేయడం జరుగుతుందన్నారు.

మార్చి 21న తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. నేటి నుండి తిరుమలలో వంద మంది శ్రీవారి సేవకులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకూ 5200 మంది శ్రీవారి సేవకులను వినియోగించి 24 వేల కేజీల జీడిపప్పు బద్దలు అందివ్వడం జరిగిందని వెల్లడించారు.

Lorry Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా కూరగాయల లారీ

తిరుమలలో వంద మంది శ్రీవారి సేవకుల వినియోగం ద్వారా రోజు వెయ్యి కేజీల జీడిపప్పు బద్దలు అందివ్వడం జరుగుతుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి నిత్యం రెండున్నర నుండి మూడు వేల కేజీల జీడిపప్పు అవసరం ఉంటుందని తెలిపారు. జీడిపప్పు బద్దలు చేయడానికి అవసరమైన యంత్రాలు ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు