Tirumala Ghat Road : తిరుమల రెండవ ఘాట్ రోడ్డును పరిశీలించిన ఈవో జవహర్‌రెడ్డి

తిరుమల రెండవ ఘాట్ రోడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు.

Tirumala Ghat Road : తిరుమల రెండవ ఘాట్ రోడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఘాట్ రోడ్ లో పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మరమ్మతులు పూర్తి చేస్తామని ఈవో అన్నారు. తిరుమల రెండవ ఘాట్‌రోడ్‌లో ఇప్పటికే ఐఐటి నిపుణులు పరిశీలించి సూచనలు చేశారని….కేరళ కొల్లం చెందిన అమృత విశ్వ విద్యాపీఠం ప్రొఫెసర్లు కూడా ఘాట్ రోడ్డును పరిశీలిస్తారను ఆయన చెప్పారు.

నిపుణుల సూచనలను తీసుకొని ఘాట్‌రోడ్‌లో తదుపరి చర్యలు తీసుకుంటామని….భారీ ప్రమాదం జరిగినా భక్తులకు ఎటువంటి అపాయం లేకుండా స్వామివారే కాపాడారని జవహర్ రెడ్డి అన్నారు. రెండవ ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి చేసి లింకు ద్వారా తిరుమలకు భక్తులను అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా భాష్యకారుల సన్నిధి నుండి పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి చేసి రెండవ ఘాట్ రోడ్డును పునరుద్ధరిస్తామని జవహర్ రెడ్డి చెప్పారు.
Also Read : Road Acccident : రోడ్డు ప్రమాదం-ప్రియురాలు మృతి-ప్రియుడు ఆత్మహత్య
ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుర్కోవడానికి టీటీడీ ఇంజనీర్లకు శిక్షణ ఇప్పిస్తాం…నిపుణుల సూచనలు పరిగణలోకి తీసుకొని కూలడానికి సిద్ధంగా ఉన్న బండరాళ్ళు తొలగించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. భక్తుల భద్రత విషయంలో రాజీ లేకుండా మరమ్మతులు త్వరగా పూర్తి చేస్తామని ఈవో జవహర్ రెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు