అయోధ్య లైవ్ ఎందుకు ఇవ్వలేకపోయామంటే!..Svbc ఛానెల్ సీఈవో క్లారిటీ
- nagamani
- Published On : August 6, 2020 / 05:06 PM IST
[lazy-load-videos-and-sticky-control id=”u8ceqSg-Z5U”]
అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమిపూజను ఆగస్టు 5న యావత్ భారతదేశంలో పాటు ప్రపంచంలోనే రామభక్తులంతా కన్నులారా వీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా 250 టీవీ ఛానళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అయితే టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ఛానల్ మాత్రం చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదు. ఈ వ్యవహారానికి సంబంధించి టీటీడీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై విమర్శలు వెల్లువెత్తటంతో ఎస్వీబీసీ ఛానల్ సీఈవో వెంకట నగేశ్ స్పందించారు. అయోధ్యలో రామమందిర భూమిపూజను లైవ్ టెలీకాస్ట్ చేయకపోవటంపై తమకు ఎటువంటి దురుద్ధేశం లేదని…అదే సమయంలో శ్రీవారి నిత్య కళ్యాణోత్సవ సేవ లైవ్ ఉన్నందుకే రామమందిర భూమిపూజ కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వలేకపోయామని స్పష్టం చేశారు.సుందరకాండ పారాయణంలో కూడా అయోధ్య ప్రాసస్త్యంగురించి చెప్పామనీ తెలిపారు.
కాగా..అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వకపోవటంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. సీఎం జగన్ విశాఖ శారదాపీఠానికి వెళ్తే ప్రసారం చేశారని… అయోధ్య రాముడి కార్యక్రమాన్ని ఎందుకు వదిలేశారని బీజేపీ ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
దీనిపై చానల్ సీఈవో మాట్లాడుతూ..ప్రతిరోజు తిరుమలలో స్వామివారికి నిత్యకల్యాణం ఉంటుందని చెప్పింది. అయోధ్య భూమిపూజ సమయంలో కల్యాణం జరుగుతోందని… ఆ సమయంలో శ్రీవారి కల్యాణాన్ని ప్రసారం చేశామని తెలిపింది. అయోధ్య భూమిపూజకు సంబంధించి కార్యక్రమాన్ని రికార్డు చేశామని దాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా భక్తుల కోసం ప్రసారం చేస్తామని వెల్లడించారు.
