కొండపై రీల్స్.. రూల్స్.. యాక్షన్‌.. శ్రీవారి సన్నిధిలో మార్పు మొదలు..

శ్రీవారి లడ్డూ, అన్నదానం, కొండ మీద శుభ్రత ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ సర్కార్.

TTD

నిత్య కల్యాణం పచ్చతోరణం. ప్రతిరోజు తిరుమల సన్నిధి ఇలా ఆధ్యాత్మికతో వెలిగిపోతూ ఉంటుంది. శ్రీవారి క్షేత్రానికి ఎంతో ప్రత్యేకత..ఆగమశాస్త్ర నిబంధనలు.. కొన్ని పద్ధతులు ఉన్నాయి. గతంలో కొండ మీదకు వెళ్లామా..స్వామివారిని దర్శించుకున్నామా..ఆధ్యాత్మిక చింతనలో గడిపి వచ్చామా లేదా అన్నట్లుగా ఉండేది.

ఇప్పుడంతా కొండంత రాజకీయం అయిపోయింది. హంగు, ఆర్భాటాలతో స్వామివారిని దర్శించుకోవడం..బయటికి వచ్చి పొలిటికల్‌ కామెంట్స్ చేయడం..లేకపోతే మాడవీధుల్లో ఫోటోలకు పోజులు ఇవ్వడం..ఇన్‌స్టా వచ్చాక రీల్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. కొందరి ఓవరాక్షన్‌ కాస్త శ్రీవారి ఆలయం పవిత్రతకు భంగం కలిగిస్తోంది.

పొలిటికల్ కామెంట్స్ చేసేందుకు తిరుమల కొండ పార్టీ ఆఫీస్‌ కాదు. రీల్స్ చేసేందుకు టూరిస్ట్ ప్లేస్‌ అంతకన్నా అసలే కాదు. దేవదేవుడి దర్శనం అంత ఈజీ కాదు. స్వామివారి దర్శనం భాగ్యం ఊరికే దక్కదు. అలాంటప్పుడు దేవుడి సన్నిధిలో వీలైనంత ఎక్కువ సేపు ఉండే ప్రయత్నం చేయాలే కానీ..రీల్స్, పాలిటిక్స్ చేస్తామంటే ఊరుకునేది లేదంటోంది ఏపీ సర్కార్.

శ్రీనివాస్‌, దివ్వెల మాధురి ఇష్యూ
ఈ మధ్యే శ్రీవారి దర్శనానికి వెళ్లిన దువ్వాడ‌ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి..ద‌ర్శనం తర్వాత ఫొటోల‌కు పోజులివ్వడం, రీల్స్ చేయడం, పెళ్లిపై మాట్లాడటం వంటి ఓవరాక్షన్ చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్యవహరించారని టీటీడీ విజిలెన్స్ యాక్షన్‌కు రెడీ అయింది. ఇద్దరిపై కేసు పెట్టడమే కాదు..విచారణకు రావాలంటూ దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సరైనవే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దర్శనం తర్వాత ఓ ఫోటో తీసుకోవడం వరకు ఓకే. రీల్స్ చేయడం.. పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రకటనలు చేయడం వంటివి అవసరమా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు పొలిటికల్ కామెంట్స్‌పై కూడా పూర్తిగా బ్యాన్ విధించాలని.. స్వామివారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడొద్దన్న రూల్ కూడా పెట్టాలని అంటున్నారు.

ఇప్పటికే ఉన్న నిబంధనలను స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే శ్రీవారి ఆలయ విశిష్టత, పవిత్రకు భంగం కలగదంటున్నారు భక్తులు. గతంలో ఎమ్మెల్సీ రోజా కూడా కొండపై ఫోటోలకు పోజులిచ్చి..పొలిటికల్ కామెంట్స్‌ చేసి కాంట్రవర్సీకి తెరలేపారు. దువ్వాడ శ్రీను, మాధురి, రోజానే కాదు చాలామంది కొండమీద రీల్స్, ఫోటోస్, పొలిటికల్ కామెంట్స్‌తో పవిత్రకు భంగం కలిగించేలా చేశారు.

సీరియస్‌గానే చర్యలు
ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్ మాత్రం తిరుమల పవిత్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. చూసిచూడనట్లుగా కాదు ప్రక్షాళన చేసేందుకు సీరియస్‌గానే చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే దువ్వాడ శ్రీను, మాధురికి నోటీసులు ఇచ్చారు. పొలిటికల్ కామెంట్స్ చేయకుండా రూల్స్‌ను స్ట్రిక్ట్‌గా అమలు చేస్తామంటున్నారు.

శ్రీవారి లడ్డూ, అన్నదానం, కొండ మీద శుభ్రత ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ సర్కార్. ఆగమశాస్త్ర నిబంధనలు, టీటీడీ రూల్స్ పటిష్టంగా అమలు చేసేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది ప్రభుత్వం. తన, మన అని తేడా లేకుండా తిరుమలలో ఓవరాక్షన్‌ చేస్తే యాక్షన్‌ తప్పదని చెప్పకనే చెప్తోంది సీఎం చంద్రబాబు ప్రభుత్వం.

మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..!