Thirumala : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల

అలాగే సుప్రభాతం, తోమాల, అర్చన, సంబంధించి అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

Tirumala

Thirumala Srivari : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఇవాళ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆగ‌స్టు నెలకు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార ఆగస్టు నెల టికెట్ల కోటాను విడుదల చేసింది. అలాగే సుప్రభాతం, తోమాల, అర్చన, సంబంధించి అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

Tirumala Alert : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. వాటిపై నిషేధం, కొండపైకి అనుమతించరు

ఈనెల 26న మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు తమ పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పించింది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్‌ డిప్‌ ద్వారా సేవా టికెట్లు పొందిన భక్తులకు టీటీడీ సమాచారం అందించనుంది. భ‌క్తులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వ‌ర్చువ‌ల్ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్రదీపాలంకరణ సేవా టికెట్ల కోటా బుధవారం విడుదల కానుంది.