రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిపై రూ.200 కోట్ల పరువు నష్టం కేసు.. టీటీడీ సంచలన నిర్ణయం

  • Publish Date - November 16, 2020 / 02:59 PM IST

ttd defamation case: రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువు నష్టం కేసు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి కోర్టులో వేసిన పరువు నష్టం కేసుని కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. పరువు నష్టం కేసుని వెనక్కి తీసుకునేలా ఇదివరకు వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని టీటీడీ మరో పిటిషన్ దాఖలు చేసింది.



టీటీడీ ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ.. 2008లో రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై 200 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేసింది. అయితే.. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో… నాటి పరువు నష్టం కేసును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించిన టీటీడీ.. కొన్నాళ్ల క్రితం కోర్టులో పిటిషన్ వేసింది. కానీ… రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వస్తుండటంతో.. ఆ నిర్ణయాన్ని మార్చుకుంది.