Srivari Parakamani : శ్రీవారి పరకామణిని విస్తరించనున్న టీటీడీ

శ్రీవారికి కానుకల పెరగడంతో పరకామణిని విస్తరించాలని టీటీడీ నిర్ణయించింది. రూ.10కోట్లతో నూతన పరకామణి భవనాన్ని నిర్మిస్తోంది.

Parakamani

Srivari Parakamani : తిరుమల శ్రీవారి పరకామణిని టీటీడీ విస్తరించనుంది. ఆలయం వెలుపల పరకామణి నిర్వహణ సన్నాహాలు చేస్తోంది. శ్రీవారికి కానుకల పెరగడంతో పరకామణిని విస్తరించాలని టీటీడీ నిర్ణయించింది. రూ.10కోట్లతో నూతన పరకామణి భవనాన్ని నిర్మిస్తోంది.

ఏటా రూ.1000 కోట్లకు పైగా శ్రీవారి హుండీ ఆదాయం వస్తుంది. ఏటా సుమారు 1200 కేజీల బంగారు కానుకలు వస్తున్నాయి. రోజుకు రూ.4కోట్ల నుంచి రూ.6కోట్ల శ్రీవారి హుండీ ఆదాయం వస్తుంది.

Tirumala : తిరుమల అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ‌ టోకెన్లు విడుదల

శ్రీవారికి భారీగా విరాళాలు వస్తున్నాయి. టీవీఎస్‌ మోటార్‌ వెహికల్స్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ సుదర్శన్‌ శనివారం స్వామివారికి కోటీ 5లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌కు అందజేయాలని డీడీని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డికి అందజేశారు.

హైదరాబాద్‌కు చెందిన జీవీఏ ఇన్‌ఫ్రా సంస్థ శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి కోటీ 26వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. హరిబాబు, S.వెంకటేశ్వరులు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. S.రవిబాబు ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ. 2 లక్షల 50 వేలు డోనర్ సెల్‌లో అందజేశారు.