Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. నేటినుంచి ఆ టికెట్లు ఆన్‌లైన్‌లో పొందవచ్చు
తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను రేపు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లు కాగా శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ..
- Harishth Thanniru
- Published On : July 19, 2022 / 09:41 PM IST
Thirumala
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లను రేపు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ వెబ్ సైట్ లో పేర్కొంది.. ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లు కాగా శుక్రవారం మినహా మిగతా రోజుల్లో 750 టోకెన్ల చొప్పున కేటాయించనుంది.
TTD : టీటీడీ కీలక నిర్ణయాలు..సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు.. అర్థరాత్రి దాటిన తర్వాత పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ముందుగానే వెండి వాకిలి దాటి బంగారు వాకిలికి చేరుకోవాలి. సుప్రభాత సేవలో భక్తులు అంగ ప్రదక్షిణ మొక్కులు తీర్చుకుంటారు.
TTD Decisions : రద్దీ తగ్గే వరకు ఇంతే, భక్తుల నడుమ బ్రహ్మోత్సవాలు.. టీటీడీ కీలక నిర్ణయాలు
కరోనా కారణంగా తిరుమలలో రెండేళ్లుగా అంగప్రదక్షిణ టోకెన్లు నిలిచిపోయాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ నెల నుంచి మళ్లీ ఈ టోకెన్లను టీటీడీ అందిస్తోంది. అయితే సీఆర్ఓ కార్యాలయంలో ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉండేవి. జూలై నుంచి ఆన్ లైన్ లో అంగప్రదక్షిణ టికెట్లు అందిస్తున్నారు. నేరుగా టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
