TTD Decisions : రద్దీ తగ్గే వరకు ఇంతే, భక్తుల నడుమ బ్రహ్మోత్సవాలు.. టీటీడీ కీలక నిర్ణయాలు

ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.(TTD Decisions)

TTD Decisions : రద్దీ తగ్గే వరకు ఇంతే, భక్తుల నడుమ బ్రహ్మోత్సవాలు.. టీటీడీ కీలక నిర్ణయాలు

Tirumala

TTD Decisions : టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోందని, భక్తుల రద్దీ తగ్గేంతవరకు సర్వదర్శన భక్తులకు ప్రస్తుత విధానమే అమలు చేస్తామని స్పష్టం చేశారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత సర్వదర్శన టోకెన్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్వదర్శన భక్తులకు స్లాట్ (టోకెన్) విధానంపై అధ్యయనం జరుగుతోందన్నారు.

Tirumula Hundi Income Report : తిరుమలలో కాసుల గలగల.. జూన్‌లో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

ఈసారి భక్తుల నడుమ, మాడవీధుల్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తుందని తెలిపారు. అక్టోబర్ 1న గరుడ వాహనం, 5న చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో నూతన పార్వేట మండపం నిర్మాణానికి టీటీడీ ఆమోదం తెలిపింది.(TTD Decisions)

రూ.7.32 కోట్లతో ఎస్వీ గోశాలలో పశుగ్రాసం కొనుగోలుకు టీటీడీ ఆమోదం తెలిపింది. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో పచ్చదనం పెంపు, సుందరీకరణకు రూ.2.90 కోట్లు కేటాయించారు. తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామి వెండి కవచాల స్థానంలో బంగారు కవచాలు అమర్చాలని నిర్ణయించారు. సింఘానియా ట్రస్ట్ ద్వారా తిరుమలలోని టీటీడీ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించాలని నిర్ణయించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఆటోమెటిక్ మెషిన్లతో లడ్డూ బూందీ తయారీపై టీటీడీ సమావేశంలో చర్చించారు. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ కు చెందిన సాంకేతికత వినియోగించాలని నిర్ణయించారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ మార్క్ ఫెడ్ తో ఒప్పందం చేసుకున్నట్టు టీటీడీ చైర్మన్ తెలిపారు. 12 రకాల ఉత్పత్తులను టీటీడీ అవసరాల కోసం సేకరించేందుకు మార్క్ ఫెడ్ తో అవగాహనకు వచ్చామన్నారు.(TTD Decisions)

శ్రీవారి ఆనంద నిలయ బంగారు తాపడం పనులు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆగమ సలహా మండలి సూచనలు మేరకు బంగారు తాపడం పనులు చేపడతామన్నారు. బంగారు తాపడాన్ని బయటకు తీసి పూత వేయాలా లేదా మెషిన్ల ద్వారా తాపడం వేయాలా అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమలలో ఆక్టోపస్ భవనం నిర్మాణం పూర్తి చేయడానికి రూ.7 కోట్లు కేటాయించినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

Salakatla Brahmotsavam : రెండేళ్ల తర్వాత.. మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలు, భక్తులకు దర్శనం

టీటీడీ నిర్ణయాలు..
ఆగస్టు 16 నుంచి 20 వరకు నెల్లూరులో వైభవోత్సవాలు
రూ.154 కోట్ల వ్యయంతో చిన్నపిల్లల ఆసుపత్రికి టెండర్లు ఖరారు
రూ.7.32 కోట్లతో యస్వీ గోశాలకు పశుగ్రాసం కొనుగోలు
రూ.2.7 కోట్లతో నూతన పార్వేటి మంటపం
రూ.2.9 కోట్లతో అమరావతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద పచ్చదనం అభివృద్ధి
రూ.18 లక్షలతో బేడీ ఆంజనేయస్వామికి స్వర్ణకవచం(TTD Decisions)
ఆక్టోపస్ కోసం కేటాయించి భవన నిర్మాణానికి మరో రూ.7 కోట్లు
యంత్రాలతో లడ్డూ ప్రసాదం బూందీ తయారీపై అధ్యయనం
ప్రసాదాల తయారీకి ఉపయోగించే సేంద్రియ ముడిసరుకుల కొనుగోలుకు మార్క్ ఫెడ్ తో ఒప్పందం
ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం పనులు
దేశవ్యాప్తంగా శ్రీవారి వైభవోత్సవాల నిర్వహణ.