Salakatla Brahmotsavam : రెండేళ్ల తర్వాత.. మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలు, భక్తులకు దర్శనం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు జరుగనున్నాయని ..రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.

Salakatla Brahmotsavam : రెండేళ్ల తర్వాత.. మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలు, భక్తులకు దర్శనం

Tirumala Rush (1)

Salakatla Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు జరుగనున్నాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. తిరుమల అన్నమయ్య భ‌వ‌నంలో శ‌నివారం నిర్వ‌హించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో భక్తులను ఉద్దేశించి ఈవో మాట్లాడారు.

Tirumala Income : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. పదేళ్ల రికార్డు బద్దలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Tirumala : సెప్టెంబరు నెల వ‌స‌తి కోటా విడుదల చేసిన టీటీడీ

బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబర్ 1న గరుడ వాహనం, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం జరుగనున్నాయి. కరోనా కారణంగా తిరుమలలో కొంత కాలం పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం అగస్టు 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాల నుండి జానపద కళాకారులు విచ్చేసి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలపిస్తారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

Tirumala Srivaru : ఈ నెల 12న తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు