Tirumula Hundi Income Report : తిరుమలలో కాసుల గలగల.. జూన్‌లో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. కొన్నాళ్లుగా ప్రతి నెలా వడ్డీ కాసుల వాడి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. జూన్ నెలలోనూ రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయి.(Tirumula Hundi Income Report)

Tirumula Hundi Income Report : తిరుమలలో కాసుల గలగల.. జూన్‌లో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

Tirumala

Tirumula Hundi Income Report : తిరుమలలో కొలువుదీరిన కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని జూన్ నెలలో ఎంత మంది భక్తులు దర్శించుకున్నారు, శ్రీవారి హుండీ ఆదాయం ఎంత వంటి వివరాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. జూన్‌ నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 23.23 లక్షలుగా ఉంది. అదే విధంగా భారీ ఎత్తున హుండీలో కానుకలు వచ్చాయి. హుండీ ఆదాయం రూ.123.74 కోట్లగా ఉంది. జూన్ నెలలో విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 95.34 లక్షలు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 50.61 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 11.61 లక్షలు.

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. భారీ సంఖ్యలో వచ్చే భక్తులు అందుకు తగ్గట్లే స్వామివారికి పెద్ద మొత్తంలో మొక్కులు, కానుకలు సమర్పిస్తుంటారు.(Tirumula Hundi Income Report)

Tirumala Income : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. పదేళ్ల రికార్డు బద్దలు

అయితే కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు స్వామివారి దర్శనం పరిమిత సంఖ్యలోనే కల్పించారు. కొవిడ్‌ ఆంక్షలతో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చాక సాధారణ రోజుల మాదిరిగానే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. రెండేళ్లుగా వేచిచూస్తున్న భక్తులు వెంకన్న దర్శనానికి పోటెత్తారు. మొక్కులు తీర్చుకునేందుకు క్యూ కట్టారు. దీనికి తోడు వేసవి సెలవులు కూడా కావడంతో కొండపై భక్తులు రద్దీ అమాంతం పెరిగిపోయింది. దాంతోపాటే శ్రీవారి హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. మే నెలలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో అక్షరాల రూ.130.29 కోట్లు వచ్చింది. మే నెలకు సంబంధించి 22 లక్షల 62 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Tirumala : సెప్టెంబరు నెల వ‌స‌తి కోటా విడుదల చేసిన టీటీడీ

ఇక టీటీడీ చరిత్రలోనే తొలిసారి వెంకన్న హుండీ ఒక్కరోజు ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది. కొండకు భక్తులు పోటెత్తడటంతో ఆదాయం పెరిగింది. ఒక్కరోజే ఏకంగా రూ.6 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. మొత్తం విరాళాలు రూ.6.18 కోట్లుగా తెలిపింది. ఇప్పటిదాకా 2012 ఏప్రిల్ 1న తిరుమల వెంకన్న హుండీకి ఒకరోజు అత్యధికంగా లభించిన ఆదాయం రూ.5.73 కోట్లు. ఇప్పుడు మొట్టమొదటిసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటింది. ఇప్పుడు 2012 రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కొన్ని రోజులుగా ప్రతి నెలా వడ్డీ కాసుల వాడి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. టీటీడీ లెక్కల ప్రకారం శ్రీవారి హుండీ ఆదాయం గత నాలుగు నెలలుగా ప్రతి నెలా రూ.100 కోట్లు పైమాటే ఉంది. గతంలో ఎప్పుడూ ఎరుగని రీతిలో ఒక్క మే నెలలోనే శ్రీనివాసుడి ఖాతాలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం రావడ విశేషం. రెండు నెలలుగా కొండ భక్తులతో కిటకిటలాడింది. ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.128 కోట్లు.. ఏప్రిల్‌లో రూ.127.5 కోట్లు వచ్చింది. జూన్ నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

Tirumala Srivaru : ఈ నెల 12న తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు