TTD : టీటీడీ కీలక నిర్ణయాలు..సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామివారికి వెండి కవచాల స్థానంలో బంగారు కవచాలు అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో సుందరీకరణకు 2.90 కోట్ల రూపాయలు కేటాయించారు.

TTD : టీటీడీ కీలక నిర్ణయాలు..సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Ttd

Updated On : July 12, 2022 / 11:44 AM IST

TTD decisions : టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సెప్టెంబర్ 27న జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో బ్రహ్మోత్సవ వేడుకలను మాడవీధుల్లో జరపడానికి టీటీడీ పాలక మండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామివారికి వెండి కవచాల స్థానంలో బంగారు కవచాలు అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో సుందరీకరణకు 2.90 కోట్ల రూపాయలు కేటాయించారు. 2కోట్ల 70 లక్షల రూపాయలతో పార్వేట మండపం నూతన భవన నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది.

Tirumala : సెప్టెంబరు నెల వ‌స‌తి కోటా విడుదల చేసిన టీటీడీ

అలాగే సింఘానియా ట్రస్టు ద్వారా తిరుమలలోని టీటీడీ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించాలని నిర్ణయించారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహించేందుకు ఏపీ మార్క్ ఫెడ్‌తో ఒప్పందం చేసుకున్నారు. తిరుమలలో ఆక్టోపస్ భవన నిర్మాణం పూర్తి చేయడానికి 7 కోట్ల రూపాయలు కేటాయించారు.

అలాగే ఆటోమెటిక్ మెషిన్లతో లడ్డూ బూందీ తయారీపై కూడా చర్చించారు. సర్వదర్శన భక్తులకు స్లాట్ విధానంపై టీటీడీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భక్తుల రద్దీ తగ్గేంతవరకు సర్వదర్శన భక్తులకు ప్రస్తుత విధానమే అమలు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.