TTD : భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు .. టీటీడీ విజిలెన్స్‌కు చిక్కిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జి

నకిలీ ఆధార్ కార్డులతో భక్తుల్ని శ్రీవారి దర్శనానికి పంపిస్తు వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. అలా నెల రోజుల వ్యవధిలో షాబ్జి 19మంది సిఫారసు లేఖలు పంపించారని అధికారులు గుర్తించారు.

mlc shaik sabji

TTD : టీటీడీ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా చిక్కారi ఏలూరు టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. నకిలీ ఆధార్ కార్డులతో భక్తుల్ని శ్రీవారి దర్శనానికి పంపిస్తు వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. అలా నెల రోజుల వ్యవధిలో షాబ్జి 19మంది సిఫారసు లేఖలు పంపించారని అధికారులు గుర్తించారు. శ్రీవారి దర్శనం కోసం ఆరుగురు భక్తుల నుంచి రూ.1.05 లక్షలు తీసుకున్నారని..ఎమ్మెల్సీ షాబ్జి డ్రైవర్ ఖాతాకు భక్తులు నగదును పంపించినట్లుగా గుర్తించారు.దీంతో ఎమ్మెల్సీ షాబ్జిని అరెస్ట్ చేయటానికి విజిలెన్స్ అధికారులు యత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎమ్మెల్సీ షేక్ షాబ్జి తరచు శ్రీవారి దర్శనానికి వస్తుండటాన్ని గుర్తించిన టీటీడీ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ తనిఖీలు నిర్వహించింది. షాబ్జి నకిలీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళుతున్నట్లు అలాగే వారినుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు..ఆ డబ్బులను ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాకు పంపిస్తున్నట్లు గుర్తించారు. అలా నెల రోజుల్లో 19మంది సిఫార్స్ లేఖలు జారీ చేసారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. ఏపీ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు షాబ్జి ఇలా సిఫారసులు చేస్తు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.