TTD: 18న టీటీడీ వాచీల ఈ-వేలం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 18న వాచీల ఈ-వేలం జరగనుంది. భక్తులు ప్రధాన ఆలయంతోపాటు, ఇతర ఆలయాల్లో సమర్పించిన వాచీలను ఈ-వేలం ద్వారా సొంతం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
- Narender Thiru
- Published On : August 3, 2022 / 07:58 PM IST
TTD: టీటీడీ సంస్థ ఈ నెల 18న వాచీల ఈ-వేలం నిర్వహించనుంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈ-వేలంలో అందుబాటులో ఉంచుతారు. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా 18న ఈ-వేలం నిర్వహించనున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి తెలిపారు.
National Herald Office: నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌కు సీల్ వేసిన ఈడీ
ఇందులో సీకో, హెచ్ఎమ్‌టీ, టైటాన్, సోని, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, సిటిజన్, రొలెక్స్‌తోపాటు ఇతర కంపెనీల వాచీలను వేలంలో అందుబాటులో ఉంచుతారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా పాడైన వాచీలు.. ఇలా వివిధ కేటగిరీలుగా, మొత్తం 22 లాట్ల వాచీలు ఈ-వేలంలో ఉంటాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నెంబరులో, కార్యాలయం వేళల్లో సంప్రదించవచ్చు. అలాగే టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.
