Srivari Virtual Service Tickets : తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ

తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ ఇవాళ (శుక్రవారం) విడుదల చేయనుంది. మార్చి నెల కోటాకు సంబంధించిన ఈ టిక్కెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.

Srivari Virtual Service Tickets : తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ ఇవాళ (శుక్రవారం) విడుదల చేయనుంది. మార్చి నెల కోటాకు సంబంధించిన ఈ టిక్కెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఒక్కసారైనా దర్శించుకుని తరించాలని భక్తులు కోరుకుంటున్నారు. భక్తుల కొంగుబంగారమైన శ్రీనివాసుడికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సేవా చేసుకోవాలని కోరుకునేవారు చాలామంది ఉంటారు.

అలాంటి వారి కోసం టీటీడీ వర్చువల్ సేవా టికెట్లను శుక్రవారం విడుదల చేయనుంది. మార్చి నెల కోటాకు సంబంధించిన ఈ టికెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది. ఇందులో భాగంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవా టికెట్లతోపాటు సంబంధిత దర్శన టికెట్లను విడుదల చేయనుంది.

Srivari Sarvadarshanam : తిరుమలలో భక్తుల రద్దీ.. టోకెన్లు లేనివారికి 22 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం

అలాగే మార్చి నెలకు గానూ రూ.300 టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనుంది. ఇక ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను టీటీడీ మధ్యాహ్నం 2గంటలకు విడుదల చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు