కవలల ప్రాణం తీసిన తల్లి వివాహేతర సంబంధం
- murthy
- Published On : September 15, 2020 / 01:11 PM IST
చిత్తూరు జిల్లా సదుంలో దారుణం జరిగింది. తల్లి వివాహేతర సంబంధం కారణంగా అభం,శుభం తెలియని ఇద్దరు చిన్నారులు బలయ్యారు. జిల్లాలోని రామిరెడ్డిపల్లి పంచాయతి, ఒడ్డుపల్లికి చెందిన ఉదయ్ కుమార్(28)కు రామిరెడ్డిపల్లికి చెందిన వివాహిత హేమశ్రీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. హేమశ్రీ(25)కి భర్త వెంకటేశ్వర రెడ్డి ద్వారా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు.
https://10tv.in/gujarat-mumbai-man-booked-for-teens-rape/
ఉదయ్ హేమశ్రీల మధ్య ఏం జరిగిందో, ఏమో తెలీదు కానీ ఏడాది వయస్సున్న తన ఇద్దరు కవల పిల్లలు పునీత్, పునర్విలతో కలిసి మంగళవారం ఉదయం చింతపర్తివారి ప్లలె,నడిమోడు కుంట చెరువులో దూకి ఆత్నహత్యాయత్నం చేసుకున్నారు.
