Twist in TDP 3rd list bjp telangana leader get baptla mp ticket
TDP 3rd List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లతో తెలుగుదేశం పార్టీ శుక్రవారం విడుదల చేసిన మూడో జాబితాలో ట్విస్టు చోటు చేసుకుంది. తెలంగాణ బీజేపీ నాయకుడు అనూహ్యంగా ఏపీలో టీడీపీ దక్కించుకున్నారు. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి టి. కృష్ణ ప్రసాద్‌ను బాపట్ల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలో డీజీగా పనిచేసిన ఆయన తెలంగాణలో బీజేపీ వరంగల్ టికెట్ ఆశించారు.
తెలంగాణ బీజేపీ నాయకుడిగా ఉన్న కృష్ణ ప్రసాద్ ఏపీలో టీడీపీ టికెట్ దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు, ఏపీ టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన ఇంకా తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్నారు. గతంలో పార్టీ మారతారని ప్రచారం జరిగినా ఆయన తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు నచ్చే బీజేపీలో చేరారని, అలాంటి పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. తాజాగా బాపట్ల ఎంపీగా టికెట్ దక్కించుకోవంతో ఆయన టీడీపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది.
కృష్ణ ప్రసాద్ నేపథ్యం..
టి. కృష్ణ ప్రసాద్ 1960లో హైదరాబాద్ లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సుబ్బయ్య (ప్రిన్సిపల్ ITI ), విజయలక్ష్మి(స్కూల్ టీచర్). IIM అహ్మదాబాద్ నుంచి MBA, NIT వరంగల్ నుండి B.Tech చేశారు. 1986లో ఐపీఎస్ గా ఎంపికయ్యారు. 34 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2020, మార్చిలో రిటైరయ్యారు. నరేంద్ర మోదీ విధానాలకు ఆకర్షితులై 2022లో బీజేపీలో చేరారు.
Also Read: 9 స్థానాలు పెండింగ్‌లో పెట్టిన టీడీపీ.. వారి కోసమేనా?