Viveka
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. వివేకా హత్య వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని.. వివేకా రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో కొన్నేళ్లుగా అంతర్గత విభేదాలున్నాయన్నాని పిటిషన్‌లో తెలిపారు.
వివేకా హత్య కేసులో ఆయన అల్లుడు, చిన బావమరిది రాజ శేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలతో పాటు కొమ్మా పరమేశ్వర రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైజీ రాజేశ్వర రెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌ల పాత్ర ఉందని.. వారినీ సీబీఐ విచారించాలని తులసమ్మ విజ్ఞప్తి చేశారు. కేసుతో సంబంధంలేని వారిని సీబీఐ ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తోందని, గతంలో సిట్ నివేదికలను బయటపెట్టాలని కోరారు తులసమ్మ.
అటు వివేకా హత్య ఘటనపై కేసు వద్దన్నారని అప్పటి సీఐ శంకరయ్య సీబీఐకి స్టేట్‌మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇక డ్రైవర్ దస్తగిరి చేసిన ఆరోపణన్నీ అబద్ధాలేనన్నారు భరత్‌యాదవ్. డబ్బుల కోసం దస్తగిరి ఎంతకైనా దిగజారుతాడని చెబుతున్నాడు. సీబీఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు భరత్ యాదవ్. తాము చెప్పిందే విచారణలో చెప్పాలంటూ ఒత్తిడి చేశారంటూ ఆరోపించారు.