Chittoor : ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. డ్రైవర్, క్లీనర్ మృతి

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ సహా క్లీనర్ చనిపోయారు. లారీ ఢీకొన్న ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీని బయటికి తీసేందుకు అధికారులు క్రేన్ ను తీసుకొచ్చారు.

Lorry Accident

road accident : చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలో లారీ భీభత్సం సృష్టించింది. కండ్రికల్ లోని ఓ ఇంట్లోకి సిమెంట్ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

లారీ డ్రైవర్ తోపాటు క్లీనర్ కూడా చనిపోయారు. ఇక లారీ ఢీకొన్న ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. మరోవైపు ఇంట్లోకి దూసుకెళ్లిన లారీని బయటికి తీసేందుకు అధికారులు క్రేన్ ను తీసుకొచ్చారు.

Road Accident : మేడారం జాతరకు వెళ్లొస్తుండగా విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి

మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. రణస్థలం మండలం పైడి భీమావరం ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. నలుగురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితులు కేరళకు చెందిన యాత్రికులుగా గుర్తించారు.