Two Sons Of Farmer Pulling Bullock Cart Instead Of Bulls
farmer pulling bullock cart : కర్నూలులో కాడెద్దులను రైతులు సొంత పిల్లల్లా చూసుకుంటారు. వాటికి చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడుతారు. జిల్లపాడుకు చెందిన రాముడు ఇలాగే స్పందించారు. తన కాడెద్దుల్లో ఒకటి అనారోగ్యంతో బండి లాగలేకపోవడం గుర్తించి వాటిని తప్పించి తన కొడుకులతో బండిని లాగించారు. గ్రామంలో వ్యవసాయ పనులు లేకపోవడంతో ఇసుక తరలిస్తున్నారు.
శుక్రవారం రోజూలాగే బండిలో నందికొట్కూరుకు ఇసుకను తరలించి తిరిగి వెళుతుండగా ఓ ఎద్దు ఆరోగ్యం క్షీణించింది.బండి లాగలేక ఆగిపోయింది. దీంతో ఆ రైతు ఇంటి వద్ద ఉన్న కుమారులను పిలిపించి బండిని లాక్కురమ్మని చెప్పి ఎద్దులను తోలుకుని వెళ్లారు. అల్లూరు రహదారిలో ఈ దృశ్యం కనిపించింది.