Students injured in East Coast express : ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో తొక్కిసలాట, ఇద్దరు విద్యార్ధులకు అస్వస్థత..మధ్యలోనే దించేసిన రైల్వే పోలీసులు

ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే ఇద్దరు విద్యార్ధులు తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు.దీంతో ఈ ఇద్దరు విద్యార్ధులకు రైల్వే పోలీసులు విజయనగరం రైల్వే జంక్షన్ లో దించేసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Students injured in East Coast express : ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో తొక్కిసలాట, ఇద్దరు విద్యార్ధులకు అస్వస్థత..మధ్యలోనే దించేసిన రైల్వే పోలీసులు

two students injured after stampede in east coast express train

Updated On : November 2, 2022 / 4:19 PM IST

Students injured in East Coast express : ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే ఇద్దరు విద్యార్ధులు తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు.దీంతో ఈ ఇద్దరు విద్యార్ధులకు రైల్వే పోలీసులు విజయనగరం రైల్వే జంక్షన్ లో దించేసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కంభంలో బీఈడీ పరీక్షలు బుధవారం (నవంబర్ 2,2022) రాయటానికి విద్యార్ధులు భారీగా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేశారు. దీంతో రద్దీ ఎక్కువ కావటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు విద్యార్దులు తీవ్ర అస్వస్థకు గురికావటంతో రైల్వే పోలీసులు వారిని విజయనగరంలో దించేసి చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

బాధిత విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కంభంలో బీఈడీ పరీక్ష రాసి స్వస్థలం ఒడిశాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా..ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులోని ఒక బోగీలో 200 మంది ఎక్కారు. దీంతో ఈ బోగీలోని ప్రయాణీకులకు ఊపిరి ఆడకపోవటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అస్వస్థతకు గురైన విద్యార్ధులను వెంటనే విజయనగరం రైల్వేస్టేషన్ లో దింపేశారు. వారికి చికిత్సఅందించాలని అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఈ ఇద్దరిని విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.