Cat Bit : పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి

డాక్టర్ల సూచన మేరకు వారు టీటీ ఇంజక్షన్ వేయించుకున్నారు. అయితే గాయాలు పూర్తిగా నయమైనా.. వారం రోజుల నుంచి ఇద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చికిత్స పొందుతున్న ఇద్దరూ చనిపోయారు.

Cat

Two women killed : ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పిల్లి కరవడంతో ఇద్దరు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. మొవ్వ మండలం వేములమడలో పిల్లి కరవడంతో ఇద్దరు మహిళలు మరణించారు. వివరాళ్లోకి వెళ్తే.. రెండు నెలల క్రితం ఇద్దరు మహిళలను పిల్లి కరిచింది. రిటైర్డ్ కండక్టర్‌ సాలి భాగ్యారావు భార్య కమల, ప్రైవేటు డాక్టర్ బొడ్డు బాబూరావు భార్య నాగమణిని గత డిసెంబర్ లో పిల్లి కరిచింది.

డాక్టర్ల సూచన మేరకు వారు టీటీ ఇంజక్షన్ వేయించుకున్నారు. అయితే గాయాలు పూర్తిగా నయమైనా.. వారం రోజుల నుంచి ఇద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చికిత్స నిమిత్తం కమల.. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చేరగా, నాగమణి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గత శుక్రవారం చేరారు.

Cat comes to Owner:15 రోజుల్లో 15 కిమీలు ప్రయాణించి యజమానిని చేరుకున్న పిల్లి

శనివారం (మార్చి5, 2022) వారిద్దరూ ఒకేసారి ప్రాణాలు మృతి చెందారు. పిల్లి కరవడంతో వారికి రేబిస్ సోకినట్టు వైద్యులు తెలిపారు. పిల్లి, కుక్క, ఎలుక, పాము లాంటివి కరిస్తే సరైన ట్రీట్ మెంట్ తీసుకుని జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు అన్నారు.