Ugadi Panchangam 2021 Kcr Jagan Chandrababu Horoscope
Ugadi Panchangam 2021 KCR Jagan Chandrababu Horoscope : ఉగాది అంటే తెలుగువారి అతి ముఖ్యమైన పండుగ. అంతేకాదు తొలి పండుగ కూడా. ఇక ఉగాది పర్వదినాన జాతకం చెప్పించుకోవడం ఓ ఆనవాయితీ. అందుకే ఉగాది నాడు పంచాంగ శ్రవణం క్రమం తప్పకుండా ఉంటుంది. ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆత్రుత అందరికీ ఉంటుంది. మరీ ముఖ్యంగా రాజకీయ నేతలకు. రాష్ట్రాలను పాలించే సీఎంల జాతకం ఎలా ఉంటుంది? ఈ ఏడాది వారికి కలిసొస్తుందా? చక్రం తిప్పేది ఎవరు? ఇది తెలుసుకోవడానికి అంతా ఆసక్తిచూపిస్తారు. మరి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎలా ఉండనుంది? చంద్రబాబు భవిష్యత్తు ఏంటి?
ఉగాది సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఏపీ సర్కార్ కు ప్లవ నామ సంవత్సరం కలిసి వస్తుందని పండితులు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఏడాది కాస్త జాగ్రత్తగా ఉండాలన్న పండితులు దైవానుగ్రహం ఉంటే గ్రహానుగ్రహం ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుకు గతేడాది ఎదురైన సంఘటనలే మరికొద్ది రోజులు పలకరిస్తాయని పండితులు అన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే భవిష్యత్తు ఆయనదే అని తెలిపారు పండితులు.
ప్లవ అంటే చీకటని పారదోలి వెలుగులు నింపేదని పండితులు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలోని శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు శుభం కలగాలని కోరుకుందామన్నారు. గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోయినా రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌ల జాతకాలు చాలా బాగున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగుతాయాని జోస్యం చెప్పారు.
* ప్లవనామ సంవత్సరం పాలకులకు శుభపలితాలను ఇస్తుంది
* ఏపీ ప్రభుత్వానికి అంతా మంచే జరుగుతుంది
* అన్ని విషయాల్లో ఇబ్బంది లేకుండా ముందుకు నడుస్తుంది
* జాతకం ప్రకారం సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగా ఉండాలి
* ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు
* దైవానుగ్రహం ఉంటే గహానుగ్రహం అవసరం లేదు
* చంద్రబాబుకి గత సంఘటనలే మరికొద్ది రోజులు ఎదురుకానున్నాయి
* భవిష్యత్తు అంతా చంద్రబాబుకు మంచే జరుగుతుంది