Kondapally
Kondapalli Twist: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నిక విషయంలో దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు నేడు విచారించింది. ఈ సమయంలో కేసు విషయంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. విచారణ బెంచ్ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు న్యాయమూర్తి.
దీంతో ఈ కేసు విచారణ మరో బెంచ్‌కి వెళ్లనుంది. ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తితో వైసీపీ కౌన్సిలర్ల తరపున వాదిస్తున్న న్యాయవాది వాదనకు దిగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
తన వాదనలను వినాలని అడ్వొకేట్ పట్టుబట్టగా.. న్యాయవాది వాదనలను వినబోనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో ఓటు హక్కు అంశంలో న్యాయమూర్తితో న్యాయవాది వాదనకు దిగి.. కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొనే అర్హత ఎంపీకి లేదన్నారు.
దీంతో ఎంపీ ఓటు హక్కు అభ్యర్థనను ఎన్నికల అధికారి తిరస్కరించారన్నారు. ఈ విషయంపైనే విచారణ సమయంలో న్యామమూర్తికి, న్యాయవాదికి మధ్య వాదన జరిగింది.