AP Politics : కేంద్ర కేబినెట్‌లో ఏపీకి మరో బెర్త్‌..? ఆ ముగ్గురిలో కేంద్రమంత్రి అయ్యేదెవరు.?

AP Politics : మోదీ ప్రభుత్వంలో 69 మంది మంత్రులుండగా, మరో 12 మందిని నియమించుకునేందుకు అవకాశం ఉంది. 70 ఏళ్ల వయసు దాటిన 12 మందికి పైగా క్యాబినెట్‌, సహాయమంత్రులను తప్పించి యువ ఎంపీలకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు టాక్‌.

Union Cabinet expansion Updates

AP Politics : త్వరలో సెంట్రల్ క్యాబినెట్ షఫ్లింగ్. మోదీ టీమ్‌లో ఏపీ నుంచి కొత్తగా బెర్త్‌ ఎవరికి.? ఎలక్షన్ టీమ్‌లో ఉండేదెవరు.? ఈ చర్చ ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ సెప్టెంబరు 1వ తేదీన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేసే అవకాశం ఉందట. గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు, కేంద్ర మంత్రి వర్గ ప్రక్షాళన, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకం జరుగనుంది.

Also Read : Nepal Floods : వామ్మో.. నేపాల్ టైప్‌లో ముంచెత్తే ప్రాంతాలు మనకి కూడా ఉన్నాయా..!

మోదీ ప్రభుత్వంలో 69 మంది మంత్రులుండగా, మరో 12 మందిని నియమించుకునేందుకు అవకాశం ఉంది. 70 ఏళ్ల వయసు దాటిన 12 మందికి పైగా క్యాబినెట్‌, సహాయమంత్రులను తప్పించి యువ ఎంపీలకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు టాక్‌. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల నుంచి చోటు దక్కేదెవరికి.? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలో కొత్తగా అమాత్య యోగం వరించేదెవరిని అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఈ మధ్యే బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఏపీ నుంచి ముగ్గురికి చోటు కల్పించారు. దీంతో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర నేతలకు అవకాశం దక్కే ఛాన్స్ లేదన్న చర్చ జరిగింది. లేటెస్ట్‌ టాక్‌ ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ఎంపీల నుంచి ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో పాటు..ముగ్గురు కేంద్రమంత్రుల్లో ఒకరికి ప్రమోషన్ కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఏపీ నుంచి ప్రస్తుతం ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు క్యాబినెట్‌ ర్యాంకు మినిస్టర్‌గా ఉండగా..గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు. విస్తరణ తర్వాత కూడా వీరిని కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్‌కుఇండిపెండెంట్ చార్జ్‌తో ప్రమోషన్ దక్కబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ముగ్గురు మంత్రుల శాఖలు మారొచ్చని అంటున్నారు. వీరితో పాటు మరో ఎంపీని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయట.

ఏపీలో టీడీపీ, బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఉంది. సెంట్రల్ క్యాబినెట్‌లో జనసేనకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆ ఆ పార్టీకి ఈసారి ఛాన్స్ ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి బాలశౌరి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లేటెస్ట్‌గా లింగమనేని రమేష్‌ను రాజ్యసభకు పంపారు. ఈ ముగ్గురిలో ఒకరికి చోటు కల్పిస్తారనే టాక్ అయితే నడుస్తోంది. బాలశౌరి థర్ట్‌ టైమ్‌ ఎంపీ..సీనియర్‌ లీడర్ కావడంతో..కేంద్రమంత్రివర్గ రేసులో ఆయన పేరుగా ప్రచారంలో ముందుంది.

ఇక పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయడంతో పాటు..కొత్తగా గవర్నర్‌ నియామకాలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. దీంతో ఏపీ బీజేపీ నేతలను గవర్నర్ పోస్టులు ఊరిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం..బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పోస్ట్ పక్కా అంటున్నారు. సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆల్రెడీ గోవా గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మరో రెండు గవర్నర్ పోస్టులు ఏపీకి దక్కే అవకాశం ఉందట. ఒకటి బీజేపీకి నేతకు ఇస్తే మరొకటి టీడీపీ లీడర్‌కు ఇస్తారనే మాట వినిపిస్తోంది. బీజేపీ కోటాలో కిరణ్‌కుమార్‌రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా పంపిస్తారని బలంగా ప్రచారం నడుస్తోంది.

కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగారు. అసెంబ్లీలో విప్, స్పీకర్‌గా..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2024లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిన ఆయనకు..ఇప్పుడు గవర్నర్ పదవి దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. టీడీపీ నుంచి ఒకరికి గవర్నర్‌ గిరి దక్కొచ్చని భావిస్తున్నారట. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, ప్రతిభా భారతి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరి పేరు ఖరారు చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎప్పటి నుంచో రాజ్యసభకు వెళ్లాలని ఆశపడుతున్నారు.

ఈ మధ్యే జరిగిన రాజ్యసభ బెర్తుల భర్తీలో యనమలకు చోటు దక్కలేదు. దీంతో ఆయనను గవర్నర్‌గా పంపితే బలమైన సామాజికవర్గంతో పాటు బీసీలకు పెద్దపీట వేసినట్లు అవుతుందని టీడీపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి కొత్తగా కేంద్ర మంత్రి పదవి దక్కేదెవరికో..గవర్నర్‌ అయ్యే యోగ్యం ఎవరికి ఉందో చూడాలి మరి.